Friday, March 13, 2009

నీవు ఏమి చేయు చున్నావు ?

ప్రియమైన నాభిడ్డా నీకు నా శుభములు . ఈ దినమున నేను నిన్ను అడుగుచున్నాను * నీవు ఏమి చేయుచున్నావు * ?. నీవు ఏమి చేపుతావో వినాలని వుంది . నీ సమాధానముకోరకు ఎదురు చూస్తున్నాను.

నేను ఏమి చేయుచున్నాను : నా ప్రభువా నాదేవా ఏది నా సమాధానము.
  1. నాకు ఒక ప్రత్యేకమేనా గుర్తింపు కావాలని కోరుచు నాది అనే సామ్రాజ్యమను నేను సృస్త్తిన్చుకోనినాను.
  2. అందరు నామాటలు వినాలి, నాకు విధేయులు కావాలి .
  3. నేను భాగా డబ్బు సంపాదించాలి ముందు ముందు నాజీవితం ప్రశాంతంగాను మరియు ఆనందంగాను వుండాలి అందుకే ఇప్పటినుంచే కష్టపడుచున్నాను.
  4. నూతనమైన ప్రణాలికలను రుపొందిన్చుకుంటూ దురప్రాంతములకు వెళ్ళుచున్నాను.
  5. నా పనులను ఎవరైనా విమర్శించినా , అనవసరమైనసలహాలను ఇచ్చినా నాకు చాలా కోపం వస్తున్నది.
  6. నేను నడుస్తున్న మార్గములను నా విజయములను నా కుటుంబసబ్యులకు, స్నేహితులకు , బంధువులకు చెపుతూ నా సమయమును వారితో ఎక్కువగా గడుపుచున్నాను .
  7. నేను నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి న మార్గములను చూపిస్తూ నడిపిస్తున్నాను .
  8. అనారోగ్యముతోను , ఆర్ధిక సమస్యలతో వున్నా వారికి నా వంతు సహాయం చేస్తున్నాను అదియు వారు దానికి అర్హులు ఐయితేనే .
  9. నాకు అస్సలు సమయమే సరిపోవటం లేదు.
  10. నేను దేవుని దగ్గరికి వెళ్ళలేక పోవుచున్నాను. నాపనుల ఒత్తిడి రోజు రోజుకి పెరుగుచున్నది కనుక దేవునితో సమయం వేచిన్చలేకపోవుచున్నాను. అందుకే దేవునికి ఎప్పుడో ఒక్కసారి కృతజ్ఞతలు తెలిపి నాపనిని నేను చేసుకుంటున్నాను.